మొక్కలు నాటిన కమెడియన్ అలీ..

100
ali gc

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు కమెడియన్ అలీ.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.ఎం.పి సంతోష్ కుమార్ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అలీ అన్నారు.అనంతరం మరో ఇద్దరు ( సోదరుడు సినీ ఆర్టిస్ట్ ఖయుమ్ , బావమరిది కరీం ) గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.