జగన్‌పై నమ్మకముంది: అలీ

74
ali
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌పై తనకు నమ్మకముందన్నారు సినీ నటుడు అలీ. ఏపీలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ నుండి ఇద్దరిని, ఏపీ నుండి ఇద్దరిని ఎంపిక చేశారు జగన్‌. చివరివరకు సినీ నటుడు అలీ పేరు ప్రముఖంగా వినిపించినా ఎవరూ ఊహించని విధంగా ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి,వియసాయిరెడ్డి,మస్తాన్ వలీ పేర్లను ప్రకటించారు జగన్‌.

ఈ నేపథ్యంలో స్పందించారు అలీ. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని… జగన్ దృష్టిలో తాను ఉన్నానని, తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తాననీ తెలిపారు. తనకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదన్నారు. అయితే భవిష్యత్‌లో తనకు సముచిత స్ధానం దక్కుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -