జగన్‌ను కలిసిన నాగార్జున..

325
Akkineni Nagarjuna
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్‌ హీరో నాగార్జున వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని లోటస్‌పాండ్‌లోని ఆయ‌న‌ నివాసంలో క‌లిశారు. జగన్‌తో నాగార్జున భేటీ రాజకీయంగా సంచలనం రేపుతోంది. అయితే, ఏ విషయమై జగన్‌ను నాగార్జున కలిశారన్న విషయంపై క్లారిటీ రావల్సివుంది. వీరిద్ద‌రి మ‌ధ్య అర‌గంట పాటు స‌మావేశం జ‌రిగింది.

అయితే బయట వినిపిస్తున్న సమాచారన్ని బట్టి గుంటూరు నుంచి నాగ్ పోటీచేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై జగన్‌తో నాగ్‌ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన నాగార్జునను మీడియా పలకరించిగా..ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడం అంతా నాగార్జున రాజకీయాల్లోకి వస్తారని వార్తలు ఉపందుకున్నాయి.

ఈ నేపథ్యంలో నాగార్జున మీడియాకు వివరణ ఇచ్చారు. తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. తనకు రాజకీయాల మీద ప్రత్యేక ఆసక్తి లేదని, ఇతరుల టికెట్‌ కోసం తానెందుకు జగన్‌ను కలుస్తానని నాగార్జున అన్నారు. జగన్‌ మా కుటుంబ సన్నిహితుడు. పాదయాత్ర పూర్తి చేసిన జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు.

- Advertisement -