ఆస‌క్తిరేపుతున్న ‘గూఢ‌చారి’ ట్రైల‌ర్…

232
gudachary
- Advertisement -

ప్ర‌ముఖ నటుడు అడ‌విశేష్ ముఖ్య పాత్ర‌లో న‌టించిన సినిమా గూఢ‌చారి. అభిషేక్ పిక్చ‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ వారు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించారు. అడ‌వి శేష్ స‌ర‌స‌న హీరోయిన్ గా శోభిత ధూళిపాళ నటించింది. నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొద్ది రోజుల క్రితం ఈమూవీకి సంబంధించిన టీజ‌ర్ ను కూడా విడుద‌ల చేశారు.

Gudachari

ఈటీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. తాజాగా గూఢ‌చారి సినిమా ట్రైల‌ర్ ను న్యాచుర‌ల్ స్టార్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ల‌వ్..యాక్ష‌న్, ఎమోష‌న్ ను క‌వ‌ర్ చేస్తూ ఈసినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు శశి కిర‌ణ్ తిక్క‌. ఈసినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను ట్రైల‌ర్ లో చూపించారు. ప్ర‌కావ్ రాజ్, వెన్నెల కిషోర్, సుప్రీయ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈసినిమాను ఆగ‌స్టు 3వ తేదిన విడుద‌ల చేయ‌నున్నారు. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థాక‌థ‌నాల‌తో ఈసినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు హీరో అడ‌వి శేష్. చాలా రోజుల త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు అడ‌విశేష్. ఈసినిమా ఎంత‌వర‌కూ విజ‌యం సాధిస్తుందో చూడాలి.

- Advertisement -