- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తుండగా ఇందులో కీ రోల్ పోషిస్తున్నారు చెర్రీ. తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
చిరు స్టెమినాను రుజువు చేస్తూ యూ ట్యూబ్‌ని షేక్ చేస్తోంది ఆచార్య టీజర్. #AcharyaTeaser యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో మారింది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ అదిరిపోయింది.
రాంచరణ్ వాయిస్ తో ప్రారంభమైన టీజర్.. చిరు యాక్షన్ సీన్స్ వరకు సాగిన టీజర్ తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం బాగుంది. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా మే 13న రిలీజ్ కానుంది.
- Advertisement -