చిరు ‘ఆచార్య’ నుండి క్రేజీ అప్‌డేట్‌..

80
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాతో నటిస్తున్నాడు. ఇందులో చిరు కు జోడీగా కాజల్ మెరవనుంది. మరో జంటగా చరణ్ – పూజ హెగ్డే అలరించనున్నారు. చరణ్ – నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా ఫస్టు సింగిల్ గా వచ్చిన ‘లాహే లాహే’ సాంగ్ కి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట జనంలోకి దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేయనున్నారు.

చరణ్ – పూజ హెగ్డే లపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ మెలోడీ గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా రామ్ చరణ్ – పూజా హెగ్డే లకు సంబంధించిన ఓ పోస్టర్‌ను వదిలారు. ఈ చిత్రంలో నక్సలైట్ సిద్ధ ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే కనిపించనుంది. తాజాగా వచ్చిన పోస్టర్‌లో మురారి వాయిస్తున్న అందాల నీలంబారి సిద్ధ కౌగిలిలో ఒదిగిపోయి ఉంది. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -