‘ఆచార్య’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. అంతా రెడీ..

155
Acharya Movie
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ఈనేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ వేగం పెంచింది. ఇటీవల విడుదలైన ఆచార్య ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ – యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

ఇందులో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరంజీవి – చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో నక్సలైట్స్‌గా కనిపించనున్నారు. దేవాలయ భూముల ఆక్రమణకు పాల్పడిన కొంతమంది అవినీతి పరుల ఆటకట్టించే దిశగా ఈ కథ నడుస్తుంది. చిరంజీవి సరసన కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. ఈ సినిమాలో రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. నిరంజన్ రెడ్డి – అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

- Advertisement -