ఇల్లందు జేకే మైన్స్‌లో ఆచార్య ..

161
puvvada
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 13న రిలీజ్ కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుండగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ఆచార్య సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు జేకే మైన్స్‌లో నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడించారు. ఈ మేరకు ఆచార్య టీం…అజయ్‌ని కలవగా కొరటాల శివ కోరిక మేరకు అనుమతులు ఏర్పాటు చేస్తాం అని వెల్లడించారు. స్థానికంగా అనుమతులతో పాటు చిరంజీవికి తానే తన నివాసంలో ఆతిధ్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇటీవలె ఆచార్య షూటింగ్ సెట్స్‌లో పువ్వాడ అజయ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి.. చిరంజీవికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు పువ్వాడ.

- Advertisement -