దీపావళి బరిలో ఆచార్య..!

381
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి-దర్శకుడు కొరటాల కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే అలరించనుంది. చిరూ – చరణ్ ఇద్దరూ కూడా ఒక ఆశయం కోసం పోరాడే నక్సలైట్లుగా కనిపించనున్నారు. చరణ్ పోషించిన ‘సిద్ధా’ పాత్ర ఆయన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా ఎప్పుడు విడుద‌ల అవుతుంది అనే దానిపై క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కూడా పూర్తైన నేప‌థ్యంలో సినిమాని దీపావ‌ళికి విడుదల చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్లోనే విడుదల చేయాలనే ఒక ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

- Advertisement -