సోషల్ మీడియాలో ఇప్పుడు లోకేష్‌కి సంబంధించిన వార్తలే వైలర్ అవుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సార్వ భౌ అంటూ పదాలను పలకడంలో… ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున.. వర్ధంతి అని.. ‘రాబోయే రెండేళ్లలో అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పాటే నా లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని… వచ్చే ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించాలని.. ఇలా ప్రతీ మీటింగ్‌లో ఏపీ యువ మంత్రి నారా లోకేష్ పొరపాటు పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా లోకేష్‌కు తీసిపోలేదు.
గతనెల జులై 19న ఢిల్లీలో రామ్మోహన్నాయుడు వివాహ రిసెప్షన్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆ వేడుకకు ఎవరెవరు వచ్చారో తెలుపుతూ అచ్చెన్నాయుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఫొటోలను పోస్టు చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోడీతోపాటు లోకసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీమతి షీలా దీక్షిత్ గారు, ఇతర కేంద్రమంత్రులు హాజరయ్యారు’ అని ఆ ఫొటోకు వ్యాఖ్యానం రాశారు. అయితే, ప్రస్తుత లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కాగా, ఆయన మాత్రం ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అని రాయడంతో విమర్శల పాలయ్యాడు.
తాజాగా జయంతికి బదులు వర్థంతి అని మాట్లాడి నాలుక్కరుచుకున్నాడు అచ్చాన్నాయుడు.. అంతేకాదు లోకే్శ్ సహచర్యంతోనే తనకూ అలాగే వచ్చిందని చెప్పి అక్కడున్న వారిని నవ్వించారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 108వ జయంతి వేడుకలు జరుగుతున్న వేళ, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, గౌతు లచ్చన్న వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. వెంటనే పక్కనున్న వారు తప్పును సవరించడంతో, తన వ్యాఖ్యలను సరిచేసుకున్న ఆయన, తప్పును లోకేశ్ పై నెట్టేసి చేతులు దులుపుకున్నారు అచ్చన్నాయిడు.