తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు…భారీగా బంగారం, నగదు లభ్యం

599
Mro Acb
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్‌ లావణ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో దొరికిన డబ్బులు, నగలు , పలు పేపర్లను చూసి షాక్ గురయ్యారు అధికారులు. ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు ఓ రైతు నుంచి 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కొందుర్గు వీఆర్వో అనంతయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రైతు నుంచి రూ.9 లక్షలు డిమాండ్ చేసిన అనంతయ్య..

 

అందులో రూ.5 లక్షలు తహసీల్దార్ లావణ్య వాటా అని వివరించాడు. దీంతో అధికారులు లావణ్యను విచారించారు. అయితే, అనంతయ్య చెప్పిన దాంట్లో నిజం లేదని, ఆ లంచంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. అడుగడుగునా గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. మూడు గంటల్లోనే ఏకంగా రూ.93.50 లక్షల నగదు, 40 తులాల బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తి పత్రాలు లభించాయి.

- Advertisement -