4 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు..

424
acb raid
- Advertisement -

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎనిమిది లక్షల రూపాయలను డిమాండ్ చేసిన నేపథ్యంలో నాలుగు లక్షల రూపాయలు ముందుగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు బాధితుడు.

ఈరోజు విఆర్ఓ అంతయ్యను పథకం ప్రకారం బాధితులు అతనికి డబ్బులు ఇచ్చి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించారు. అయితే విఆర్ఓ అంతయ్య కేశంపేట మండలం నుండి ఇటీవల బదిలీపై కొందూర్గు మండల కేంద్రానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా సదరు భూమి వ్యవహారంలో ఆజమాయిషి చలాయిస్తూ డబ్బులు ఇచ్చేవరకు పని జరగదు అని ఆదేశాలు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో బాధితుడు డబ్బులు చెల్లించుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది. అయితే ఈ భూమి రికార్డుల వ్యవహారంలో అంతయ్య వెనక ఉండి కార్యాలయంలో ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా? లేదా వారు ఆడిస్తున్న విధంగా విఆర్ఓ అంతయ్య డబ్బులు డిమాండ్ చేస్తున్నాడా అన్న విషయం తేలాల్సి ఉంది.

కేశంపేట మండలం నుండి బదిలీ జరిగినప్పటికీ కొందుర్గు మండలం వచ్చి కూడా బాధితులు వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు అంటే కార్యాలయంలో ఖచ్చితంగా అతనికి ఎవరో సహకారం ఉండి ఉంటుందని పెద్ద మొత్తంలో ఈ డబ్బులు డిమాండ్ చేయడం కూడా జరిగిందని అనుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికి షాద్ నగర్ నియోజకవర్గంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండోసారి దాడులు జరిపి పట్టుకోవడం గమనార్హం.అయితే ఏసీబీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. విఆర్వో అవినీతిలో ఇద్దరు తహసీల్దార్లు షాద్ నగర్ ఆపై అధికారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విచారణ చేస్తున్నాం ఎవర్ని కూడా వదలం లంచం తీసుకుంటే చంచల్ గూడ జైలుకు పంపిస్తామని తెలిపారు.

- Advertisement -