సీఎం కేసీఆర్‌పై నమ్మకముంది: రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్

438
vanga ravinder reddy
- Advertisement -

ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా బదిలీలు జరిగాయని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్‌ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్ .కుటుంబం మొత్తాన్ని వదిలి అంతా కష్టపడి ఎన్నికలను విజయవంతంగా ముగించారని చెప్పారు.

యధావిధిగా మా స్థానాలకు బదిలీ చెయ్యాలని ప్రభుత్వంలో సీఎస్, ఇతర అధికారులను కోరి వినతి పత్రం ఇచ్చామన్నారు.అయితే కొద్దిరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని చెప్పారు.ఐనా నిరుత్సాహపడకుండా పని చేశాం.ఏపీలో రెవెన్యూ ఉద్యోగులను మళ్ళీ వాళ్ళ స్థానాలకు బదిలీ చేశారు.

దీంతో తమపై మరింత ఒత్తిడి పెరిగిందన్నారు వంగా రవీందర్‌.ఈ విషయంపై సీఎస్, ప్రభుత్వ సలహాదారులను కలిశామని తెలిపిన రవీందర్….ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని నిర్ణయానికి వచ్చామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ ఐన వాళ్ళను యధాతథ స్థానాలకు బదిలీ చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

వర్క్ టు రూల్ లో మేము పాల్గొటం లేదు, దాని వల్ల ఉపయోగం లేదన్నారు.సమస్యలు పరిష్కారం అయితే ఇవన్నీ అవసరం లేదని చెప్పిన రవీందర్…ప్రభుత్వం తమ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని ఆశీస్తున్నామని చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు.

- Advertisement -