కల్నల్‌ సంతోష్ విద్యాభ్యాసం..

608
about colonel santhosh
- Advertisement -

బిక్కుమల్ల సంతోష్ బాబు తెలంగాణలోని సూర్యపేటకు చెందిన ఇండియన్‌ ఆర్మీ కల్నల్‌. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి భారత్‌, చైనా బలగాలు ఘర్షణలో వీర మరణం పొందారు. వీరాజవాన్ సంతోష్‌ చదువులో ఎంతో చురుకైన వారు. ఇయన విద్యభ్యాసం 6వ తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్ జరిగింది.ఆ తరువాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో.. అక్కడి నుండి ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరి తన ఉన్నత విద్యను పూర్తి చేశారు.

ఆ తర్వాత ఇండియన్‌ ఆర్మీ ఉద్యోగం చేరాడు. ఆర్మీలో మొత్తం 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాడు. కల్నల్‌ సంతోష్ సర్వీస్ మొత్తం కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్,లాడక్‌లో పూర్తి చేశారు. వీటితో పాటు పాకిస్థాన్ బోర్డర్‌లో కూడా విధులు నిర్వహించారు.. కొంత కాలం ఖంగో దేశంలో విధుల నిర్వహణలో ఉన్నారు. అన్నిట్‌లోను ఆయన గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచారు. సంతోష్‌ 37 సంవత్సరల చిన్న వయసులో కల్నల్‌గా పదోన్నతి పొందడం ఇది రికార్డ్ అని చెప్పాలి. 2007లో పాకిస్తాన్ బోర్డర్‌లో ముగ్గురు చొరబాటు దారులను అంతమొందించి దేశాన్ని కాపాడారు కల్నల్‌ సంతోష్‌ బాబు.

- Advertisement -