సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన దూకుడైన ఆటతీరు వెనుక తన ఓపెనింగ్ భాగస్వామి ట్రావిస్ హెడ్ ప్రభావం ఎంత ఉందో ఆయన తాజాగా వివరించాడు.
తన బ్యాటింగ్ శైలి గురించి అభిషేక్ మాట్లాడుతూ.. బంతి నా స్లాట్ (Slot) లో ఉంటే, మొదటి బంతి నుండే భారీ షాట్లు ఆడేందుకు నేను వెనుకాడను. నా సహజసిద్ధమైన ఆటను ఆడమని కోచ్‌లు, కెప్టెన్ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అని తెలిపాడు.
ఆస్ట్రేలియా దిగ్గజం ట్రావిస్ హెడ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. ట్రావిస్‌తో కలిసి ఆడటం నాకు ఎంతో కలిసి వచ్చింది. ఆయన అనుభవం, ఒత్తిడిని ఎదుర్కొనే విధానం నాకు నేర్చుకోవడానికి సహాయపడతాయి. మేమిద్దరం కలిసి ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచాలని ముందుగానే ప్రణాళిక వేసుకుంటాం అని అభిషేక్ పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ సన్‌రైజర్స్‌కు భారీ స్కోర్లు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్లతో పాటు పేసర్లను కూడా సమానంగా ఎదుర్కోవడంలో ఆయన చూపిస్తున్న తెగువకు ప్రశంసలు దక్కుతున్నాయి. తన బ్యాటింగ్ పవర్‌ను మెరుగుపరుచుకోవడానికి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నానని, క్రీజులోకి వెళ్ళినప్పుడు కేవలం బంతిని మాత్రమే చూస్తానని ఈ యువ ఆటగాడు చెప్పుకొచ్చాడు.
ALso Read:ఏపీ కేబినెట్ భేటీ..కొత్త పెన్షన్లపై చర్చ

