కాశ్మీర్ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`. `ది తాష్కెంట్ ఫైల్స్` లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆర్టికల్ 370 చుట్టూ అల్లుకున్న కథతో ఈ చారిత్రాత్మక సినిమా తెరకెక్కుతుంది. కాశ్మీర్ వ్యాలీ సినిమాలో ఆర్టికల్ 370 ఎందుకు తీసుకొచ్చారు. ఎందుకు రద్దు చేశారునే కారణాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చరిత్రలో భాగమైన ఎంతోమంది లెజెండ్స్ పాత్రల్లో ప్రముఖ నటులు కనిపించబోతున్నారు.
ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14, 2020న ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.