రీల్‌పై రియల్‌ హీరో అభినందన్‌ బయోపిక్‌..!

242
abinandan
- Advertisement -

అభినందన్ వర్ధమాన్..! ఇప్పుడొక రియల్ హీరో! పాక్ సైన్యం కస్టడీలో రెండున్నర రోజులు గడిపినా చెదరని స్థైర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. వీరుడి ధైర్యానికి యావత్ భారతావని ఫిదా అవ్వగా ఇప్పుడెక్కడ చూసినా అభినందన్ గురించి చర్చే. యూత్‌ అయితే అభినందన్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు‌.

ఈ నేపథ్యంలో అభినందన్ ట్రెండ్‌ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్ నిర్మాతలు. బాలీవుడ్ దిగ్గజ ఫిలింమేకర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అభిషేక్ కపూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా అభినందన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలో అభి పాత్ర పోషించడానికి మీరు రెడీనా అంటూ కొందరు మీడియా ప్రతినిధులు జాన్ అబ్రహంను ప్రశ్నించగా ఆయన ఓకే చెప్పాడట. అభినందన్‌ రియల్ హీరో ఆయన జీవితం స్పూర్తిదాయకమని జాన్ చెప్పుకొచ్చాడట. యురి దాడి ఘటన నేపథ్యంలో వచ్చిన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ పై కూడా మరో చిత్రం తెరకెక్కించే ప్రయత్నాలు జరగుతున్నట్లు సమాచారం. మొత్తంగా అభినందన్‌ బయోపిక్‌ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో
హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -