రివ్యూ : అభిమన్యుడు

368
Abhimanyudu review
- Advertisement -

మాస్ హీరో విశాల్-సమంత జంటగా మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అభిమన్యుడు. తమిళంలో ఇరుంబు తిరై భారీ హిట్ సొంతం చేసుకుంది. తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉన్న విశాల్‌ అభిమన్యుడుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. పందెంకోడి తర్వాత ఆ స్ధాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న విశాల్‌కు అభిమన్యుడు హిట్ అందించిందా..?సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

తన తండ్రి అప్పులు చేయడం,అప్పు ఇచ్చిన వారి నుంచి తప్పించుకొని తిరగడం చూసి కరుణాకరన్‌(విశాల్) చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయి మిలటరీలో చేరతాడు. విపరీతమైన కోపం ఉండే కర్ణను ఎంగర్‌ మెనేజ్‌మెంట్ సర్టిఫికెట్ తేవాలని అధికారులు ఆర్డర్ వేయడంతో లతాదేవి(సమంత)ను కలుస్తాడు. ఆమె సలహా మేరకు సొంతూరు వెళ్లిన విశాల్ చెల్లెలి పెళ్లికోసం లోన్ తీసుకుంటాడు. అకౌంట్‌లోకి వచ్చిన మరుసటిరోజే మొత్తం డబ్బు మాయమైపోతుంది. సైబర్‌ హ్యాక్‌తో తానే కాదు ఎంతోమంది నష్టపోతున్నారని తెలుసుకున్న కర్ణ ఏం చేశాడు?వైట్ డెవిల్ ఎవరు..?కర్ణ అతడిని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది తెరమీద చూడాల్సిందే.

Image result for vishal abhimanyudu

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ కథ,విశాల్ – అర్జున్ నటన. విశాల్‌ మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసిన విశాల్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో ఇమిడిపోయాడు. సమంత నటన గురించి చెప్పనక్కర్లేదు. తెరపై అందంగా కనిపించింది.విలన్‌గా అర్జున్‌ జీవించేశాడు. తన పాత్రకు వందశాతం న్యాయం చేసిన అర్జున్‌..విశాల్‌ను డామినేట్ చేశాడు. మిగితా నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టకున్నారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఒక విషయాన్ని చెప్పడానికి మూడు గంటల సేపు సాగదీసి చూపించాడనే భావన కలుగుతుంది. ఫస్టాఫ్ సాదా సీదా సన్నివేశాలతో నడిపించాడు దర్శకుడు. కథలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్సయింది. కొన్ని సన్నివేశాల్లో లాజక్స్ ఉండవు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడతాయి. దర్శకుడు మిత్రన్ తనదైన స్టయిల్‌లో చిత్రాన్ని హ్యాండిల్ చేశాడు. యువన్ శంకర్ రాజా అందించిన నేపధ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా విలన్ పాత్ర తెరపై కనిపించే ప్రతిసారి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగుంది. విశాల్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

Image result for vishal abhimanyudu

తీర్పు:

డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో కళ్లకు కట్టిచూపించారు దర్శకుడు మిత్రన్. కథ,విశాల్-అర్జున్ నటన సినిమాకు ప్లస్ కాగా లాజిక్ లేని సన్నివేశాలు,సాదా సీదాగా సాగే ఫస్టాఫ్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా డిజిట‌ల్ క్రైమ్, సైబ‌ర్ నేరాలు బారిన పడకుండా మంచి కథతో విశాల్‌ చేసిన ప్రయత్నమే అభిమన్యుడు.

విడుదల తేది:01/06/2018
రేటింగ్:2.5/5
నటీనటులు:విశాల్,సమంత,అర్జున్
సంగీతం:యువన్ శంకర్ రాజా
నిర్మాత:విశాల్
దర్శకత్వం: మిత్రన్

- Advertisement -