గ్యాంగ్ స్ట‌ర్ గా ఎన్టీఆర్…పోలీస్ ఆఫీస‌ర్ గా చ‌ర‌ణ్?

248
ram ntr
- Advertisement -

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఓ భారీ మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈసినిమాకు సంబంధించిన స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈమ‌ధ్యే ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చ‌రణ్ , ఎన్టీఆర్ ల‌కు క‌థ‌ను కూడి వినిపించాడు. సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ ను మొత్తం పూర్తిచేసేశాడ‌ట రాజ‌మౌళి. త్వ‌ర‌లోనే న‌టిన‌టుల ఎంపిక కూడా ఉంటుంద‌న్నారు. అక్టోబ‌ర్ మొదటి వారంలో ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

SS-Rajamouli, ram ntr

అయితే ఈసినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలీం న‌గ‌ర్లో చ‌క్క‌ర్లు కోడుతుంది. ఈమూవీలో రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఎన్టీఆర్ పాత్ర ఎండ ఉండ‌బోతుంద‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది . గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడ‌నే వార్త ఫిలీం న‌గ‌ర్లో చ‌క్క‌ర్లు కోడుతుంది. చ‌ర‌ణ్, ఎన్టీఆర్ అన్న‌ద‌మ్ములుగా ఈసినిమాలో న‌టించ‌నున్నార‌నే టాక్ వినిపిస్తుంది. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములే అయిన‌ప్ప‌టికి ఇద్ద‌రు వేరు వేరు మార్గాల‌ను ఎంచుకోవ‌డం వ‌ల్ల ఎర్ప‌డే ప‌రిస్ధితుల ఆధారంగా సినిమాను రూపొందించ‌నున్న‌ట్లు స‌మాచారం.

 ram ntr

భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈసినిమాను డీవీవీ దాన‌య్య నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈసినిమాలో హీరోయిన్ ల‌ను కూడా ఎంపీక చేయ‌నున్నారు చిత్ర బృందం. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ లు ఇద్ద‌రూ బిజిగా ఉండ‌టంతో ఈ సినిమాను కొంచెం ఆల‌స్యంగా మొద‌లుపెట్ట‌నున్నారు. రామ్ చ‌రణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తుండ‌గా..ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమ చేస్తున్న విష‌యం తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈసినిమాపై ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాలు పెట్ట‌కున్నారు.

- Advertisement -