క్యాన్సర్ ఈ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో రకరకాల క్యాన్సర్ కారకాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో కొన్ని క్యాన్సర్‌లను ఆలస్యం నిర్థారణ చేసినా, నిర్లక్ష్యం చేసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇందులో ఒకటి అపెండిక్స్ క్యాన్సర్. ఈ రకమైన క్యాన్సర్ ఉబ్బరం, జీర్ణ సమస్యలు మరియు పొత్తికడుపు నొప్పి వంటి అనేక లక్షణాలను కలిగిస్తుంది.
ఎందుకంటే ఇది పెద్ద ప్రేగుతో అనుసంధానమై క్రమక్రమంగా పెరుగతూ వస్తుంది. ఈ రకం క్యాన్సర్ ఉన్న వాళ్లు శారీరకంగా, మానసికంగా ఆందోళనకు గురవుతుంటారు.
అయితే చివరి దశ వరకు అపెండిక్స్ క్యాన్సర్‌ను నిర్ధారించడం చాలా కష్టం.అందుకే ప్రతీ ఏడాది ఆగస్టులో అపెండిక్స్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తూ వస్తుంటారు. అయితే దీనిని చాలామంది అపెండిసైటిస్‌గా అనుమానించి లైట్ తీసుకుంటారు. తర్వాత బయాప్సీ టెస్ట్ చేస్తే అది అపెండిటైటిస్ లేదా అపెండిక్స్ క్యాన్సర్ అన్నది బయటపడుతుంది.
ఈ రకమైన క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుంది. కుడి వైపు పొత్తి కడుపులో నొప్పి, విరోచనాలు, బరువు తగ్గడం, అలసట వంటివి ఉంటాయి. అయితే చాలా అపెండిక్యులర్ క్యాన్సర్లు అపెండిక్స్‌ను శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తర్వాత మాత్రమే గుర్తించబడతాయి. చికిత్స చేసిన తర్వాత కూడా అపెండిక్స్ క్యాన్సర్ శరీరంలోని మిగితా భాగలపై తీవ్ర ప్రభుత్వం చూపుతుంది.
Also Read:సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని రిలీఫ్