‘ఏబీసీడీ’ పెద్ద హిట్ అవుతుంది- త్రివిక్ర‌మ్

228
- Advertisement -

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. సోమవారం ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో త్రివికమ్ర్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేశారు.

ABCD Movie Trailer Launch event

ఈ సందర్భంగా… త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”జల్సా’ టైంలో నేను శిరీష్‌ను చిన్న కుర్రాడిగా చూశాను. నాకు తెలిసి సినిమాలపై అండర్‌స్టాండింగ్‌ ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో శిరీష్‌ కూడా ఒకరు. సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను. తను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్‌ బాగా నచ్చింది. ఇద్దరు డబ్బున్నవాళ్లు వచ్చి కష్టాలు పడితే, మనకు చూడటానికి బాగా అనిపిస్తుంది. భరత్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. తను నటించిన వెంకీ, రెఢీ.. సినిమాల్లో తన క్యారెక్టర్‌ని బాగా ఎంజాయ్‌ చేశాను. తనను ఇలా చూడటం నాకు ఫ్యాన్‌ మూమెంట్‌లా అపిస్తుంది. ఈ సినిమాలోని ‘మెల్లమెల్లగా ..’ సాంగ్‌ చూశాను. బాగా నచ్చింది. ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనిపిస్తుంది.

కాన్సెప్ట్‌ సినిమాలను తీసే మధుర శ్రీధర్‌కి సినిమాలంటే చాలా ప్రేమ. సినిమాలను ప్రేమించే నిర్మాతల సినిమాలు బాగా ఆడాలి. దాని వల్ల మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే మధుర శ్రీధర్‌ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలని కోరుకుంటూ ఆయనకు ఈ సినిమా చాలా డబ్బులు తెచ్చి పెట్టాలని కోరుకంటున్నాను. మే 17న ‘ఏబీసీడీ’ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమాలో అమెరికన్‌ దేశీ కన్‌ఫ్యూజ్‌ అయ్యాడేమో కానీ.. ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్‌ కాకుండా, సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. దర్శకుడు సంజీవ్‌ ఈ సినిమాను తొలి సినిమాలాగా కాకుండా చాలా బాగా తీశారు. ఈ సినిమా తనకు మంచి మెమొరీగా నిలవాలని, దర్శకుడిగా తను చాలా దూరం ప్రయాణించాలి. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు” అన్నారు.

- Advertisement -