దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇటీవల ముగిసిన IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేసిన కొనుగోళ్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.IPL 2026 వేలం ముగియడంతో, 10 ఫ్రాంచైజీలు టోర్నమెంట్ 19వ సీజన్‌కు సిద్ధమయ్యేందుకు ప్రముఖ ఆటగాళ్లను తమ జట్లలో చేర్చుకున్నాయి. కొత్త సీజన్‌కు ముందు, డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అందరి దృష్టి నిలిచింది.
వేలం అనంతరం ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియో ద్వారా RCB కొనుగోళ్లపై మాట్లాడారు.వేలంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వారు డిఫెండింగ్ ఛాంపియన్స్, అందుకు కారణం కూడా ఉంది. గెలిచిన కాంబినేషన్‌ను మార్చకూడదనుకోవడం సహజం. జోర్డాన్ కాక్స్ మంచి సంతకం. బ్యాకప్‌గా ఉపయోగపడతాడు. అతను ఎంతవరకు ఆడతాడో తెలియదు కానీ అతను చాలా ప్రతిభావంతుడైన యువ ఆటగాడు అని ఏబీ అన్నారు.
వెంకటేశ్ అయ్యర్ పెద్ద సంతకం. అతడిని చాలా తక్కువ ధరకు తీసుకున్నారు. నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్న ఆటగాడు మంగేశ్ యాదవ్. యశ్ దయాల్‌కు బ్యాకప్‌గా తీసుకున్నప్పటికీ, అతను కేవలం బ్యాకప్‌కే పరిమితం కాకపోవచ్చు. అలాగే జోష్ హాజిల్‌వుడ్‌కు బ్యాకప్‌గా జేకబ్ డఫీని తీసుకోవడం కూడా మంచి నిర్ణయం. ఇది ఛాంపియన్‌షిప్ గెలిచే స్థాయి జట్టు. స్పిన్ విభాగంలో మాత్రం కొద్దిగా ‘ఎక్స్ ఫాక్టర్’ లోటు ఉంది. మరో రిస్ట్ స్పిన్నర్ ఉంటే బాగుండేది. అయినప్పటికీ RCB టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది,” అని ఆయన అన్నారు.
KKR విదేశీ స్టార్ ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టింది. క్యామరన్ గ్రీన్ పెద్ద సంతకం. చెన్నై సూపర్ కింగ్స్‌లో సీనియర్ ప్లేయర్‌గా మారబోతున్న పథిరానాను KKR తీసుకుంది. అతని అనుభవం, వేగం వారికి ఉపయోగపడతాయి. ముస్తాఫిజూర్ రహ్మాన్ ఎప్పుడూ వికెట్లు తీస్తూ ఉంటాడు. చివరి ఓవర్లలో అతను చాలా ప్రమాదకరం. అతని స్లోయర్ బాల్స్‌ను ఎదుర్కోవడం కష్టం. డెత్ ఓవర్లలో బలమైన బౌలింగ్ ఇన్సూరెన్స్‌లా అతను ఉంటాడు అని ఏబీ వ్యాఖ్యానించారు.
Also Read;BB9:తనూజ జర్నీ..ఎమోషనల్

