ఆస‌క్తి రేపుతోన్న ‘ఆటగదరా శివ’ ట్రైల‌ర్

213
- Advertisement -

కొత్త కొత్త క‌థ‌ల‌తో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది. ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్దార్ద పేరు విన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే సినిమాలు ‘ఆ నలుగురు, ‘మధుమాసం, ‘అందరి బంధువయా వంటి సినిమాలు గుర్తుకువ‌స్తాయి. కుటుంబ స‌మేతంగా చూసే సినిమాల‌ను తెరకెక్కిస్తాడు ద‌ర్శ‌కుడు చంద్ర సిద్దార్ద‌.

atagadara shiva

ఆయ‌న సినిమాల్లో ఎక్కువ‌గా ఫామిలీకి పెద్ద పీట వేస్తుంటాడు. ఆయన ఎంపిక చేసుకునే ప్రతి కథలోనూ మానవీయకోణం కనిపిస్తుంది .. సమాజంలోని స్థితిగతులను దర్శింపజేస్తుంది. ఇక తాజాగా చంద్ర‌సిద్దార్ద తీసిన చిత్రం ఆట‌గ‌ద‌రా శివ‌. ఇటివ‌లే విడుద‌లైన ఈ ట్రైల‌ర్ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. కేవ‌లం హీరో, హీరోయిన్ తో క‌థ‌ను తీసుకెళ్ల‌కుండా..క‌థ‌తోనే సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. మ‌రొకొన్ని ముఖ్య‌మైన పాత్ర‌ల‌తో క‌లిసి సినిమా సాగ‌నుంది.

ఒక ఖైదీని ఉరి తీయడానికి రావలసిందిగా ప్రభుత్వం నుంచి లేఖ అందుకున్న హ్యాంగ్ మేన్ తన జీపులో బయలుదేరుతాడు. అదే ఖైదీ జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వస్తూ ఆ హ్యాంగ్ మేన్ కి తారసపడతాడు .. అదే ఈ ట్రైలర్ లో చూపించారు. జ‌బ‌ర్ధ‌స్ద్ హైప‌ర్ ఆది కామెడీతో ఈసినిమా మ‌రో లెవ‌ల్ కి వెళ్ల‌నుంది. త్వ‌ర‌లోనే ఈసినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాన‌నున్నారు.

- Advertisement -