రెండు రాష్ట్రాల్లో ఆప్‌కు షాక్..!

2
- Advertisement -

హర్యానా, జమ్మూ కశ్మీర్‌లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌కు షాక్ తగిలింది. హర్యానా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా.. జమ్మూ కశ్మీర్‌లో ఇండియా కూటమి మెజార్టీని దాటి అధికారాన్ని దక్కించుకుంది.

జమ్మూ కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే బరిలోకి దిగగా రెండు రాష్ట్రాల్లోనూ నామమాత్రానికి పరిమితమై కనీసం ఖాతా తెరవలేదు. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు గానూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ – కాంగ్రెస్‌ కూటమి 52 స్థానాలతో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ 26 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ నాలుగు స్థానాల్లో, ఇతరులు ఎనిమిది స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Also Read:రాష్ట్రానికి రూ.11 వేల కోట్లు ఇవ్వండి: సీఎం రేవంత్

- Advertisement -