- Advertisement -
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెండు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈసారి పోటి ఆసక్తికరంగా జరగనుంది . ఇక బీహార్ ఎన్నికల నేపథ్యంలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ సంచలనం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో (243) పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ‘ఆప్’ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుండటం ఇదే మొదటిసారి.
నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు వెలువడనున్నాయి. 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీలో 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే తొలిసారి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు ఉండనున్నాయి.
Also Read:కాంతార చాప్టర్ 1..వసూళ్లివే!
- Advertisement -

