ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఆప్ ఆధిక్యం..

388
AAP
- Advertisement -

నేడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. తాజా స‌మాచారం మేర‌కు ఆప్ పార్టీ ఏడు స్థానాల్లో ముందున్న‌ది. గెలుపుపై ధీమాతో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్‌ మద్దతు దారులు పెద్ద ఎత్తును కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకున్నారు.

modi

బీజేపీ 5 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్క‌డా ఆధిక్యంలో లేదు. ఢిల్లీ కంటోన్మెంట్‌, ద్వార‌కా, జాన‌కీపూర్‌, కృష్ణ న‌గ‌ర్‌, గోండా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్న‌ది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ భద్రతా సిబ్బందిని మోహరించింది. కౌంటింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లో ఫలితాల సరళి, పార్టీల ఆధిక్యత తెలిసే అవకాశం ఉన్నది. కాగా శనివారం పోలింగ్‌ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌ సర్వేల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) తిరిగి అధికారంలోకి రానున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలో మంగళవారం విడుదలయ్యే ఫలితాలపై ఆసక్తి నెలకొన్నది.

- Advertisement -