బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది: సిసోడియా

6
- Advertisement -

ఆప్ నేత మనీష్ సిసోడియా సంచలన కామెంట్ చేశారు. తాను తీహార్‌లో ఉన్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది అని సంచలన కామెంట్ చేశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో సిసోడియా చేసిన ఈ కామెంట్ చర్చనీయాంశంగా మారింది.

జైల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బీజేపీకి అర్థమైంది… నా భార్య అనారోగ్యంగా ఉందని, నా కుమారుడు చదువుకుంటున్నాడని వాళ్లకు తెలుసు. అప్పుడు వారు నాకు ఒక అల్టిమేటం ఇచ్చారు అని చెప్పారు. కేజ్రీవాల్‌ ను వదిలేయి, లేదా జైల్లోనే ఉండాల్సి వస్తుందని భయపెట్టారన్నారు.

బీజేపీలో చేరితే ఆప్‌ ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేస్తామని వారు చెప్పారు. అంతేగా సీఎంను చేస్తారని ఆఫర్ ఇచ్చారని కానీ తాను బెదరలేదన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులను కొనుగోలు చేయడమే బీజేపీ పని అని.. వారు మాట వినకపోతే, తప్పుడు కేసులతో వారిని జైలుకు పంపిస్తారు అని చెప్పుకొచ్చారు.

2023లో దిల్లీ మద్యం విధానానికి సంబంధించి కేసులో సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 17 నెలల పాటు జైలులో ఉన్నారు సిసోడియా. ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడించనున్నారు.

Also Read:‘సంక్రాంతికి వస్తున్నాం’..ట్రిపుల్ బ్లాక్ బస్టర్

- Advertisement -