పంజాబ్ నుండి ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది.
ఆప్ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది.
రాఘవ్ చద్దా.. పంజాబ్ ఆప్ పార్టీ ఇంచార్జ్‌గా, ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పాఠక్ అత్యంత సన్నిహితుడు. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరా, భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ను రాజ్యసభకు నామినేట్ చేసింది.