రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. కమలనాథులు కూడా అధికారంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా నార్త్ లో బీజేపీ హవా గట్టిగా ఉంటుందని ఉత్తర ప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమన ఆధిక్యం కనబరుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే దేశ రాజధాని డిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎంటనేది సర్వేలు కూడా అంచనా వేయలేకపోతున్నాయి. గత కొన్నాళ్లుగా డిల్లీలో పాగా వేయాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావంతో అక్కడ బీజేపీ ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదు. అయితే ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో డిల్లీలో కూడా సత్తా చాటలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ డిల్లీ సిఎం కేజ్రీవాల్ తనదైన రీతిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డిల్లీలోని ఏడు స్థానాల్లో ఆప్ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు. అంతే కాకుండా పంజాబ్ లో కూడా ఆప్ హవా కొనసాగుతుందని అక్కడ కూడా 13 స్థానాల్లో సత్తా చాటబోతున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఆ మాత్రం ధీమా ఉండడం సహజమే అయినప్పటికి ప్రస్తుతం ఆప్ బలపడుతున్న తీరు చూస్తే బీజేపీకి కొంత ముప్పే అనేది రాజకీయ వాదులు చెబుతున్నామట. గుజరాత్, అరుణాచల ప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటి జాతీయ పార్టీ లిస్ట్ లోకి ఎక్కిన ఆప్ ను తక్కువగా అంచనా వేస్తే నష్టం భారీగానే జరిగే అవకాశం లేకపోలేదు. అందుకే డిల్లీలో ఆప్ కు చెక్ పెడితే ఆ పార్టీని నిలువరించవచ్చనే ప్లాన్ లో ఉన్నారు కమలనాథులు. కానీ ఆప్ మాత్రం రాబోయే ఎన్నికలపై కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది. ఈ నేపథ్యంలో డిల్లీలోని ఏడు స్థానాల్లో ఆప్ విజయం సాధిస్తే బీజేపీ వ్యూలహాన్ని నిరుగరడం ఖాయం. మరి డిల్లీలో ఈసారి ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో చూడాలి.
Also Read:ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది?