ఆప్‌కే సాథ్‌…కేజ్రీవాల్‌కే పట్టం?

398
kejriwal
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ సాధిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నారని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని స్పష్టం చేశాయి. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీస ప్రభావం చూపబోదని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి.

వివిధ మీడియా, సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదలచేశాయి. అన్ని సంస్థలు ఏకపక్షంగా ఆమ్‌ఆద్మీ పార్టీదే విజయమని తేల్చిచెప్పాయి. మొత్తం 70 నియోజకవర్గాలకుగానూ ఆ పార్టీ 42 నుంచి 68 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. బీజేపీ రెండో స్థానానికి పరిమితం అవుతుందని ఆ పార్టీ 2-26 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశాయి.

61.46 శాతం పోలింగ్‌ నమోదుకాగా…. 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 6% పోలింగ్‌ తగ్గింది. మొత్తం 70 నియోజకవర్గాల్లోని 672 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.

- Advertisement -