అమీర్ ఖాన్..బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న స్టార్లల్లో ఈయన ఒకరు. త్వరలో విడుదల కాబోతున్న తన చిత్రం `సీక్రెట్ సూపర్‌స్టార్` ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న అమిర్, కోహ్లీ ఆహ్వానం మేరకు నిన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.
సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన `దంగల్` ఫేం జైరాం వశీంతో కలిసి ఆయన వచ్చారు. మైదానంలో సందడి చేసిన వారిద్దరినీ క్రికెట్ వ్యాఖ్యాత జతిన్ సప్రూ కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటిలో `భారత మహిళా జట్టు కెప్టెన్ ఎవరు?` అనే ప్రశ్నకు ఆమిర్ సమాధానం చెప్పలేకపోయాడు.
`ఆమె పేరు తెలుసుగానీ, ఇప్పుడు గుర్తురావడం లేదు` అన్నాడు. జైరాకి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. అప్పటికీ సప్రూ వారికి కొన్ని హింట్లు ఇచ్చాడు. అయినప్పటికీ ఆమిర్ సమాధానం చెప్పలేకపోయాడు.