ఏదైనా ఓ కొత్త మూవీకి ఫుల్ పబ్లిసిటీ రావాలంటే ఖచ్చితంగా కాంట్రవర్శీ ఉండాల్సిందే. బహుశా.. కాంట్రవర్శీ లేకపోతే కష్టమే అనుకుంటున్నారో ఏమోగానీ కొంతమంది దర్శకులు కాంట్రవర్శీకే కమిట్ అయిపోతున్నారు. అంతేనా..? కాంట్రవర్శీ లేకున్నా…దాన్ని క్రియేట్‌చేసే పనిలో పడుతున్నారు మరికొంతమంది.
అయితే ఈ క్రమంలోనే సెట్ లోకి వెళ్ళకుండానే ‘మహాభారతం’ పై కాంట్రవర్శి మరక పడింది. అతిగొప్ప ఇతిహాసమైన మహాభారతంలో ఓ ముస్లిం నటించడమేంటి..? అంటూ ట్వీట్లవార్ నడుస్తోంది.
అసలు విషయానికొస్తే..భారతీయ చలన చిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఓ భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ మీనన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. చెప్పినట్టుగానే దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ..వేదవ్యాసుడు రచించిన “మహాభారతం” ఆధారంగా మూవీని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఈ సినిమాకి బీ.ఆర్. శెట్టి నిర్మాత కాగా.. సహ నిర్మితగా రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ వ్యవహరించనున్నాడని టాక్.
ఇంతవరకూ బాగానే ఉన్నా..బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్‌తోనే ఈ సినిమాపై కాంట్రవర్శీ మొదలైంది. కారణం ఈ సినిమాలో కర్ణుడు లేదా శ్రీక్రిష్ణుడి పాత్రలో అమీర్‌ఖాన్ నటించనున్నాడంటూ వార్తలు రావడమే.
ఈ వార్తలకు రియాక్ట్ అయిన ఫ్రెంచ్ కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గుటర్ ట్విట్టర్ ద్వారా ‘మహాభారతం’పై కామెంట్ చేశారు.
హిందువుల ఇతిహాసం మహాభారతంలో ముస్లిం అయిన అమీర్ ఖాన్ నటించడమేంటి..? సెక్యులరిజం పేరుతో బీజేపీ కూడా కాంగ్రెస్‌లా ప్రవర్తిస్తుందేమో. ఒకవేళ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రతో సినిమా తీస్తే అందులో ముఖ్యపాత్ర పోషించడానికి హిందువు నటిస్తే.. ముస్లింలు అంగీకరిస్తారా..?’ అని ట్వీట్ చేశారు ఫ్రాంకోయిర్. ఇప్పుడిదే ట్వీట్‌తో సోషల్‌మీడియాలో వార్ మొదలైంది.
ఈ క్రమంలోనే ఫ్రాంకోయిస్ ట్వీట్‌కి..రియాక్ట్ అయిన జావేద్ అక్తర్..ఫ్రాంకోయిస్‌ను ‘స్కౌండ్రల్ అని తిట్టారు. అంతేకాకుండా… ‘మహాభారతాన్ని విదేశీ నటీనటులను పాత్రధారులుగా పెట్టి.. ఒక నాటకంగా రూపొందించి పీటర్ బ్రూక్స్ ఫ్రాన్స్‌లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు నువ్వు చూడలేదా? భారతీయుల మనసులలో విషబీజాలను నాటడం కోసం నీకు డబ్బులిచ్చిన ఆ విదేశీ
పత్రిక పేరేంటో నాకు చెప్పు’ అని ప్రశ్నించారు.
అయితే.. జావేద్ అక్తర్ ట్వీట్‌కి మరో వక్తి ట్వీట్ చేస్తూ.. గౌతియార్ వల్ల భారతీయులకు ప్రమాదం ఏమీ లేదని.. అమీర్ ఖాన్ వల్ల… జావేద్ అక్తర్ లాంటి వల్లే దేశానికి ప్రమాదమని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు కూడా అక్తర్ జవాబిస్తూ..”బుర్రలేని నీకు భారతీయుల సంప్రదాయాల గురించి ఏమీ తెలియదు.
నీకు రాస్ ఖాన్ బుల్లే షా వారిస్ షా గానీ, బాబా ఫరీద్ నజర్ అక్బరాబాదీ గానీ, నిజిర్ బనారసీ గానీ, బిస్మిల్లా ఖాన్ గానీ తెలుసా.. నీకు వారెవరో కూడా తెలియదు. నువ్వు నూతిలో కప్పలాంటి వాడివి” అని సమాధానమిచ్చారు.
మొత్తానికి అమీర్ ఖాన్ ఏ పాత్రలో నటించనున్నాడన్న విషయంపై ఇంకా అధికారప్రకటన రాకుండానే ఈ సినిమా వివాదాలకు తెరలేపింది. మరి… ఫ్రాంకోయిస్ కామెంట్లకు, అక్తార్ సమాధానాలు ఇంతటితో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేస్తాయా? లేక ‘పద్మావత్’ వివాదంలా అల్లర్లు సృష్టిస్తాయా..అనేది త్వరలోనే తేలిపోతుంది.
ఇక ఇదిలాఉండగా..టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎప్పటినుంచో ‘మహాభారతం’ ఆధారంగా మూవీని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్టు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇందులో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రముఖ పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. కానీ.. రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ లతో భారీ ప్రాజెక్ట్ చేసే పనిలో పడ్డాడు. అటు మోహన్‌లాల్ కూడా వచ్చిన సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఫైనల్‌గా మహాభారతాన్ని ప్రస్తుతానికి రాజమౌళి పక్కనపెట్టినట్టే కనిపిస్తోంది.
You scoundrel, have you not seen peter brooks production of this great epic Mahabharsta in France . I would like to know which foreign agency is paying you to spread this kind of perverse and poisonous thoughts in our country
— Javed Akhtar (@Javedakhtarjadu) March 21, 2018
You scoundrel, have you not seen peter brooks production of this great epic Mahabharsta in France . I would like to know which foreign agency is paying you to spread this kind of perverse and poisonous thoughts in our country
— Javed Akhtar (@Javedakhtarjadu) March 21, 2018
You ignorant unfortunate imbecile, obviously you know nothing about our Indian traditions and culture . Do you know who were Ras khan bullay shah Waris shah, ,Baba Farid Nazeer Akbarabadi , Nizir Banarasi , Bismillah khan . You are just a frog in the stinking well of communalism
— Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2018