- Advertisement -
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అభ్యర్థులు తమ తమ ఓట్ షేర్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. తాజాగా విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇవ్వనున్నట్లు ఆమ్ ఆర్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా ముర్ము పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. జూలై 21న ఓట్లను లెక్కించనున్నారు.
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల తమకు గౌరవం ఉందని, కానీ తాము మాత్రం యశ్ంత్ సిన్హాకు సపోర్ట్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తర్వాత ఆయన ఈ కామెంట్ చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీ తరపున మొత్తం 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పంజాబ్‌లో 92, ఢిల్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు గోవాలో ఉన్నారు. ముర్ముకు బీజేడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజూ జనతాదళ్, బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీదళ్, శివసేనలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. దీంతో ముర్ముకు అనుకూలంగా 60 శాతం ఓట్ షేర్ ఉంది. నామినేషన్ సమయంలో ఆమెకు కేవలం 50 శాతం మంది మాత్రమే ఉన్నారు.
- Advertisement -