ఆకాశ వీధుల్లో… బ్లాక్ బస్టర్ సక్సెస్

118
movie
- Advertisement -

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జె, డా. మణికంఠ చిత్రాన్ని నిర్మించారు . సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వస్తున్న నేపధ్యం లో చిత్ర యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. సినిమా చూసిన ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు థాంక్స్. మార్నింగ్ షో కంటే ఈవెనింగ్ షోలు ఫుల్ అయ్యాయి. మంచి రివ్యూలు, మౌత్ టాక్ వస్తోంది. సినిమాని తప్పకుండా థియేటర్లో చూడండి. ”ఆకాశ వీధుల్లో’ మంచి లవ్ స్టొరీ, ఫ్యామిలీ డ్రామా. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. చాలా బావుందని నాకు మెసేజులు పెడుతున్నారు. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం. ”ఆకాశ వీధుల్లో’ యూనివర్శల్ కథ. ప్రతి భాషలో ఈ సినిమా ఆడుతుంది. ఈ సినిమా చూసి మీరు పది మందికి చెప్పండి. మౌత్ టాక్ ని స్ప్రెడ్ చేయండి. మా డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్సిభిటర్స్ కి, థియేటర్ వారికి థాంక్స్. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలాంటి సినిమా నేపధ్యం లేకుండా వచ్చిన నటుడి సినిమాకి ఇంత ఆదరణ లభించడం అరుదైన విషయం. అందరూ వెళ్లి సినిమా చూడండి. ఆదరించండి. నా కొత్త సినిమా ప్రకటన కూడా త్వరలోనే వుంటుంది.” అన్నారు.

పూజిత పొన్నాడ మాట్లాడుతూ.. సినిమాకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా ఆనందంగా వుంది. ఈ వారం అంతా సినిమా ఆడాలి. ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా అద్భుతంగా వుందని నాకు మెసేజులు పెడుతున్నారు. మా ఫెర్ఫార్మెన్స్ బావున్నాయని మెచ్చుకున్నారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు. ఈ సినిమాని మరింతగా ఆదరించండి” అని కోరారు.

- Advertisement -