త్వరలో 30వ ఏట అడుగుపెట్టబోతున్నాడు భారత పేసర్ ఆకాష్ దీప్. భారత జట్టులో ఆలస్యంగా అవకాశాలు దక్కించుకున్న ఆటగాడిగా అతడికి ప్రతి అవకాశమూ ఎంతో కీలకం. ఒక్కసారి అవకాశం చేజారినా తిరిగి జట్టులో స్థానం సంపాదించడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో గాయం కారణంగా తొమ్మిది నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ఆకాష్ దీప్.. మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం ఫిట్నెస్ సాధించి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇది అతడికి మూడో విదేశీ పర్యటన కానుంది.
తొమ్మిది నెలల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణిలో జరిగిన మ్యాచ్ సమయంలో ఆకాష్ దీప్ వెన్నెముకకు స్ట్రెస్ ఫ్రాక్చర్ అయింది. దీంతో అతడి పది టెస్టుల అంతర్జాతీయ కెరీర్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతడు పడిన కష్టం అంతా ఇంతా కాదని బెంగాల్ జట్టు హెడ్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా వెల్లడించారు.
తొమ్మిది నెలల పాటు అతడు రాత్రింబవళ్లు పోరాడాడు. వారానికి ఒకటి రెండుసార్లు నాతో మాట్లాడేవాడు. అప్పుడు నేను అతడికి ఒకటే చెప్పేవాడిని. మన చేతుల్లో ఉన్నది ఫిట్నెస్ సాధించడం మాత్రమే. మిగతావన్నీ దేవుడి చేతుల్లో ఉంటాయి. జరిగిన దాని గురించి బాధపడినా, సంతోషించినా ప్రయోజనం లేదు. ఏం జరిగిందో జరిగిపోయింది” అని శుక్లా గుర్తు చేసుకున్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో ఆకాష్ దీప్‌కు సౌరాశిష్ లాహిరీతో మరోసారి పరిచయం ఏర్పడింది. గతంలో బెంగాల్ అండర్-23 జట్టుకు కోచ్‌గా పనిచేసిన లాహిరీనే ఆకాష్ దీప్‌ను తొలిసారిగా అండర్-23 ట్రయల్స్‌కు ఎంపిక చేశారు.
Also Read:సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు..లాయర్‌కు నోటీసులు!

