ఆదిపురుష్‌…గుమ్మడికాయ కొట్టేశారు

74
adipurush
- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకుంది.

గత వారం ప్రభాస్, అంతకుముందు వారంతా వరుసగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తయింది. చిత్రీకరణ పార్ట్‌ను పూర్తి చేయడంతో ఇప్పుడు ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్‌పై పడింది. అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

వచ్చే ఏడాది ఆగస్టు 11న “ఆదిపురుష్‌” ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు.

- Advertisement -