ఈ ‘జోడీ’ టీజర్‌ అదిరింది..

429
jodi
- Advertisement -

హీరో ఆది సాయికుమార్ సక్సెస్ కోసం గత కొంతకాలంగా చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ.. అదికి హిట్ అనేది అందని ద్రాక్షలా ఊరిస్తోంది. ఇటివలే ఆది సాయికుమార్ బుర్రకథతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఈ మూవీతో కూడా ఆదికి కలిసిరాలేదనే చెప్పాలి. ఇక ఈ కుర్ర హీరో ప్రస్తుతం మరో సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. అదే జోడీ.

ఆది సాయికుమార్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘జోడీ’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువ దర్శకుడు విశ్వనాథ్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. నాయకా నాయికల పరిచయం .. ఆ పరిచయం ప్రేమగా మారడం .. ప్రేమికులుగా తమదైన ప్రపంచంలో విహరించడం ఈ టీజర్‌లో కనిపిస్తోంది.

ఇక మూవీ కంటెంట్ చూస్తుంటే యూత్‌కి కనెక్ట్ అయ్యేలానే వుంది. ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది. సాయి వెంకటేశ్ – పద్మజ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆది సాయికుమార్ ఈ మూవీతోనైనా సక్సెస్‌ అందుకుంటాడో చూడాలి మరి.

https://youtu.be/elyZEYmVlqY

- Advertisement -