25న ఆడవాళ్లు మీకు జోహార్లు..

103
sharwanand
- Advertisement -

కిషోర్ తిరుమల దర్శఖత్వంలో శ‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న్న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’. శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తుండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది.

ఈ చిత్రాన్ని మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ను సాధించింది.

వాలెంటైన్స్‌డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న విడుదల చేసిన ఓ మై ఆధ్య పాట‌కు ప్రేక్ష‌కుల‌నుండి విశేష స్పంద‌న ల‌భించింది.

- Advertisement -