‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ విడుదలకు ముహుర్తం ఖరారు..

81
- Advertisement -

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌తో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. శర్వానంద్, రష్మిక జోడికి మంచి మార్కులు పడ్డాయి. మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో మొదటసారిగా రష్మిక, శర్వానంద్‌లు కలిసి నటించారు.

కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్తగా ఉండబోతోంది. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అధ్బుతమైన సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయనున్నారు.

నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రాఫర్స్ : రాజు సుందరం & శేఖర్ వీ.జే
పీఆర్వో: వంశీ-శేఖర్ 

- Advertisement -