ఆ రూమర్ పై RRR నిర్మాత రియాక్షన్

89
- Advertisement -

RRR రిలీజ్ తర్వాత మీడియా ముందుకు రాకుండా వెనుకే ఉండిపోయిన నిర్మాత డీవీవీ దానయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో తనపై , సినిమాపై ఉన్న ఆరోపణలకు సమాదానం ఇచ్చాడు. ఆస్కార్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదనే ప్రశ్నకి సమాదానం ఇస్తూ తనకి ప్రమోషన్స్ లో ముందుండటం నచ్చదని , అందుకే ఆస్కార్ కి దూరంగా ఉన్నానని తెలిపాడు.

ఇక RRR సినిమాలో చిరు పెట్టుబడి పెట్టారనే విషయాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు. అసలు చిరంజీవి తన సినిమాకి ఎందుకు పెట్టుబడి పెడతారని ? అసలు ఆయనకి ఏం అవసరమని అక్కసు చూపించాడు. ఇవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేశాడు. ఇక రాజమౌళి కి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చానని కానీ ఇద్దరు పెద్ద సమవుజ్జులయిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో తనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడం ఎంతో సంతోషమని తెలిపాడు.

RRR లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ తనకి ఎంతో గర్వకారణమని దానయ్య తెలిపాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ , సుజీథ్ తో చేస్తున్న సినిమా పైనే ఆయన దృష్టి ఉండబోతుందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి…

నేను బ్రతికే ఉన్నా!

#NBK108..అప్‌డేట్

నెక్ట్స్‌ లెవల్ రావణాసుర మూవీ..ఫరియా

- Advertisement -