పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు రీమేక్ సినిమాలున్నాయి. అందులో ఒకటి వినోదయ సీతమ్, మరొకటి తేరి. ఈ రెండిటిలో తేరి రీమేక్ ను ముందుగా లాంచ్ చేశాడు పవన్. హరీష్ శంకర్ చెప్పిన భవదీయుుడు భగత్ సింగ్ కథను పక్కన పెట్టేసి ఈ రీమేక్ ఎంచుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ఖరారు చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు.
గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ రీమేక్ ను ఇప్పుడు పక్కన పెట్టేశాడు పవన్. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతమ్ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకొచ్చి కావల్సినన్ని డేట్స్ ఇచ్చాడు. ఇక హరి హర వీరమల్లు కి సైతం బ్రేక్ ఇచ్చి పవన్ హరీష్ శంకర్ కంటే ముందు ఈ రీమేక్ ను తెరపైకి తేవడం తో తేరి రీమేక్ ను పవన్ లైట్ తీసుకున్నారా? అనే అనమానాలు మొదలయ్యాయి. ఈ రీమేక్ చేయడం పవన్ అభిమానులకు అస్సలు ఇష్టం లేదు.
మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై తెరకెక్కనున్న ఈ రీమేక్ ను పవన్ ఎప్పుడు మొదలు పెడతాడో? అసలు చేస్తాడో లేదో ?
ఇవి కూడా చదవండి…