OTT:ఆ చిత్రాలు అప్పుడే ఓటీటీలోకి

46
- Advertisement -

ధమాకా సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న కన్నడ బ్యూటీ శ్రీలీలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా విరాట్‌, శ్రీలీల నటించిన ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’ సినిమా ఇప్పుడు ఆహాలో ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ మొదలైంది. శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాకు ప్లస్‌గా మారాయి. ఏపీ అర్జున్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి.

అలాగే నిన్న రిలీజ్ అయిన మీటర్ కూడా ఓటీటీకి సిద్దం అయ్యింది. ర‌మేష్ కదూరి డైరెక్షన్ లో హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘మీటర్’. ఇందులో అతుల్య రవి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యింది. దీని డిజిటల్‌ రైట్స్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది మే మొదటి వారంలో OTTలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఐతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమా ఓటీటీ హక్కులు, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్, జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. 50 రోజులు తర్వాత అంటే దాదాపుగా మే వారాంతంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిషేక్ నామ, రవితేజ సంయుక్తంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి…

ఏప్రిల్ 15న కమెడియన్ సూరి సినిమా విడుదల..

ఏప్రిల్‌ 13న మళ్లీపెళ్లి టీజర్ విడుదల..!

రుద్రుడు..థియేట్రికల్ ట్రైలర్

- Advertisement -