కరోనా ప్రపంచ దేశాలను గజగజ వణికించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి దాటికి లక్షల మంది మృత్యువాతపడగా కోట్లలో బాధితులు కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. ఒకసారి వచ్చినా వారికి తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న అలా నమోదైన కేసుల సంఖ్య తక్కువగానే ఉంది.
ఇక ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా వచ్చిన వారి సంఖ్య వేలల్లో ఉండగా ఓ మహిళకు ఏకంగా 31 సార్లు కరోనా సోకింది. రాజస్థాన్‌కు చెందిన అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారద అనే మహిళకు ఎలాంటి లక్షణాలు లేకున్నా అయిదు నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం ఆమెకు భరత్‌పూర్ లోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు శారధకు 31 సార్లు కరోనా పరీక్షలు చేశామని.. ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ భరద్వాజ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.