వరుణ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘తొలి ప్రేమ’ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చక్కటి ప్రేమకథగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. ‘ఫిదా’ తర్వాత వరుణ్ తేజ్ మరో హిట్ కొట్టాడంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమాపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సినిమాను చూసిన మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. కొన్నాళ్ళ తర్వాత తొలి ప్రేమ లాంటి సున్నితమైన ప్రేమ కథ చిత్రాన్ని చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. టెర్రిఫిక్ మ్యూజిక్, లిరిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ తేజ్, రాశీ ఖన్నాల పర్‌ఫార్మెన్స్ బ్రిలియంట్ గా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
దీనికి స్పందించిన థమన్ .. మీరు మా సినిమా చూడడమే కాక, సినిమాపై ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉంది. మా ఫేవరేట్ లీడర్ నుండి లభించిన ప్రశంసలతో మా టీం చాలా హ్యాపీగా ఉందని రీ ట్వీట్ చేశాడు థమన్. దీనికి కేటీఆర్ గ్రేట్ జాబ్ థమన్ అంటూ అభినందనలు తెలియజేశారు.