మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ఇటీవలో విడుదలైన ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. ఏకంగా విడుదలైన రెండు రోజులకే రూ.100 కోట్ల మార్కు దాటి తెలుగు బాక్సాపీస్ వద్ద తన సత్తాను చాటింది ఈ సినిమా. పూర్తి రాజకీయ నేపపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయనకు సినీ ప్రముఖుల నుంచే కాకుండా రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమా విజయానందాన్ని అస్వాదించడంలో మహేష్ భార్య నమ్రత కూడా ఉంది.
ఈ నేపధ్యంలో నమ్రత తన భర్త గురించి గురించి ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ… ‘ఈ సినిమా విజయం పట్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో రెండు అపజయాలు ముటగట్టుకున్నప్పటికి ఎక్కడా నిరుత్సాహపడలేదు. తన అభిమానులు తొందరలో ఓ హిట్ ఇవ్వాలనుకున్నారు. ఆయనకు విషయంలో అందరూ నేను చెప్పిందే వింటుంటారని అందరూ అనుకుంటారు. అది వాస్తవం కాదు. కానీ అప్పడప్పుడు కొన్ని సలహాలు మాత్రం ఇస్తుంటాను. అవి ఎలాంటివి అంటే ఆయన డ్రెసింగ్ విషయంలో తెలుగు హీరోలుగా కాకుండా వేరే డ్రసెంగ్లో కనిపిస్తే అది నా నిర్ణయం అని తెలుసుకోవాలని అన్నారు.
ఇక ఆమె తిరిగి సినిమాలో నటించక పోవడం గురించి మాట్లాడుతూ.. పెళ్లైన తర్వాత సినిమాల్లో నటించకపోవడంపై ఎక్కడా బాధపడలేదు. నాకు డబ్బులు సంపాదించాలని ఆశ లేదు. సినిమాల్లో నటించినందుకు ఓ జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. నేను ‘వాస్తవ్’ సినిమాలో చేసినప్పుడు జయా బచ్చన్ ఫోన్ చేసి నీ నటనకు జతీయ అవార్డు వస్తుందని ప్రశసంలు కురిపంచారు. అది ఎప్పటికి మరిచిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇలాంటి జ్ఞాపకాలే నాకు అవార్డులన్నారు నమ్రత.