తల్లి కావడం ప్రతి స్త్రీ కోరిక. ప్రస్తుత ఆధునిక కాలంలో ఏ వయస్సులోని వారైన తల్లి కావచ్చు అని నిరూపించారు. కానీ ఒక్క నిమిషం తల్లీ అయింది…కానీ అత్త గర్భం దాల్చి కోడలిని తల్లిని చేసింది. ఇది ఎక్కడో తెలుసా…అమెరికాలో చోటుచేసుకుంది. 56 యేళ్ల నాన్సీ(అత్త) తన కుమారుడు, కోడలి కోసం సరోగసీ ద్వారా ఐదో బిడ్డకు జన్మనిచ్చింది.
వివారాల్లోకి వెళ్తే జెఫ్ హాక్, కేంబ్రియా దంపతులకు నలుగురు సంతానం అయితే వాళ్లు ఐదో సంతానం కోసం ప్రయత్నించారు. కానీ కేంబ్రియాకు రెండు సార్లు గర్భాశయానికి సంబంధించిన ఆపరేషన్ జరగడంతో గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చంది. ఇక పిల్లలు పుట్టరని తెలిసి ఆ దంపతులు చాలా బాధపడ్డారు. సరోగసీ ద్వారా పిల్లలను కనొచ్చని ఓ డాక్టర్ సూచించాడు. డాక్టర్ మాటలకు ఆ దంపతులు ఎంతో ఆనందపడ్డారు.
సరోగసీ ద్వారా బిడ్డను కనియ్యడానికి చాలా మందిని సంప్రదించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ దంపతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి జెఫ్ హాక్ తల్లి నాన్సీ (56) ముందుకొచ్చారు. అయితే 56 ఏళ్ల వయసులో బిడ్డను కనడం అసంభవమని ఆ దంపతులు భావించారు. కానీ వాళ్లకు వేరే అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్నారు.
ఏడాది తిరగక ముందే నాన్సీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తమకు బిడ్డను ప్రసాదించిన నాన్సీకి కృతజ్ఞతగా ఆ బిడ్డకు వాళ్లు హన్నా అని పేరు పెట్టుకున్నారు. నాన్సీ అనే పేరు హన్నా నుంచి వచ్చిందని నాన్సీ కోడలు కేంబ్రియా తెలిపింది.
ఇవి కూడా చదవండి..