కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ వరద బాధితులను పరామర్శించి తిరిగి వెళ్తున్నాడు. ఈసందర్భంగా అక్కడ ఉన్న ప్రజలకు కారులో నుంచి అభివాదం చేసుకుంటు వెళ్తుండగా ఒక యువకుడు రాహుల్ గాంధీకి ముద్దు పెట్టేశాడు.
అయితే.. ఊహించని ఈ ఘటనతో తొలుత రాహుల్ అవాక్కైనప్పటికీ దీని నుంచి రాహుల్ గాంధీ తేరుకునే లోపే.. సెక్యూరిటీ సిబ్బంది అతణ్ని వెనక్కి లాగేశారు. అయితే అలా జరిగినా రాహుల్ ఏ మాత్రం సహనం కోల్పోకుండా కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే.
#WATCH A man kisses Congress MP Rahul Gandhi during his visit to Wayanad in Kerala. pic.twitter.com/9WQxWQrjV8
— ANI (@ANI) August 28, 2019