మరణించిన కూతురితో మాట్లాడిన తల్లి.. వీడియో

517
Mother meets her deceased daughter
- Advertisement -

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మనిషి ఏదైనా సృష్టించగలడు. ఈ టెక్నాలజీ వల్ల మంచి జరుగుతుంది. అలాగే చెడు కూడా జరుగుతుంది అది మనం టెక్నాలజీని ఉపయోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ టెక్నాలజీని ఉపయోగించి చనిపోయిన కూతురితో తల్లి మాట్లాడింది. ఆ తల్లి కూతురిని చూసి దుఖంలో మునిగిపోయింది. తన ముద్దు ముద్దు మాటలు విని ఎంతో మురిసిపోంది. ఇదంతా ఏలా సాధ్యం అనేగా మీ సందేహం. అయితే ఇది చూస్తే మీకే అర్ధమౌంతుంది.

దక్షిణ కొరియాలో ఓ టీవీ డాక్యుమెంటరీని రూపొందించిన నిర్వాహకులు ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఈ షో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. వీఆర్ హెడ్ సెట్ ధరించిన జాంగ్ జీ అనే ఆ తల్లి తన కూతురిని తాకగలగడమే కాక.. ఆ చిన్నారి బర్త్ డే రోజున తాను మిస్సయిన బర్త్ డే కేక్ పైని గల క్యాండిల్స్ ని కూడా వెలిగించగలిగింది. ఈ వీడియోను రూపొందించడానికి వీరికి ఎనిమిది నెలల సమయం పట్టింది. ‘మీటింగ్ యు’పేరిట వారు ఈ షో నిర్మించారు.

ఇదంతా చేయడానికి వారు నయెన్ అనే ఆ చిన్నారి తాలూకు ఫోటోలను, వీడియోల ఆధారంగా ఈ వీడియోను నిర్వాహకులు 3 డీ ఇమేజీని రీక్రియేట్ చేయగలిగారట. వాల్డ్ ఆఫ్ వర్చ్యువల్ రియాల్టీ(వీ ఆర్) లో ఇదో మెస్మరైజింగ్ యాస్పెక్ట్ అనే చెప్పుకోవాలి. ఇక జాంగ్ జీ సంతోషానికి అవధుల్లేవు. మరణించిన తన కూతురిని నిజంగానే తాను సజీవంగా చూసినట్టు, తాకినట్టు అనుభూతి చెందింది ఆమె. టచ్ సెన్సిటివ్ గ్లోవ్స్, ఆడియోలను కూడా ఈ సందర్భంగా ఈ డాక్యుమెంటరీ నిర్మాతలు ఉపయోగించారు.

అయితే దక్షిణ కొరియాలో అప్పుడే ఈ షో మీద కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మరణించిన వారిని వారి తలిదండ్రులో, బంధువులో మళ్ళీ చూసినట్టు అనుభూతి చెందినా, వారిని తాకినట్టు ఫీలయినా వారి జ్ఞాపకాలు, స్మృతులు తిరిగి మానసికంగా వారిని వేధిస్తాయని విమర్శకులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే అలస్యం ఎందుకు మీరూ చూడండి.!

- Advertisement -