ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు:భూమిక చావ్లా

160
- Advertisement -

యువకుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భూమిక చావ్లా. అతర్వాత విడుదలైన ఖుషి సినిమాతో తెలుగు యువతను తనవైపుకు తిప్పుకుంది. తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ యోగా భరత్‌ఠాకూర్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు కొంతకాలం గుడ్‌బై చెప్పింది. కానీ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎంసీఏ సినిమాతో మంచి కంబ్యాక్‌ ఇచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన కెరీర్‌లో జరిగిన పలు సంఘటనల గురించి మొదటిసారి చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్‌లో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించే సినిమాలో మొదట తననే హీరోయిన్‌గా అనుకున్నారని…తర్వాత తన స్థానంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది. అయితే ఈ విషయం తనకెంతో బాధపెట్టిందని ఆమె చెప్పుకొచ్చింది.

Also Read: 2023..ఫీమేల్ సెంట్రిక్ వెబ్‌సిరీస్‌లు ఇవే.!

తేరే నామ్ తర్వాత నాకు ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి. ఎలాంటి పాత్రలు చేయాలనే విషయంలో ఎప్పుడూ సెలెక్టివ్‌గా ఉండేదాన్ని…అయితే తేరే నామ్‌ తర్వాత నాకు ఒక బిగ్ ప్రాజెక్ట్‌కు సంతకం చేశా. అందుకోసం నేను ఏడాదంతా సినిమాలు లేకుండా ఉన్నాను. అయితే దురదృష్టవశాత్తు మొదట నిర్మాణ సంస్థ మారింది. తర్వాత హీరో..ఆ తర్వాత సినిమా టైటిల్‌ కూడా మారిపోయింది. ఫైనల్‌గా హీరోయిన్‌ కూడా మారింది. అలా ఆ సినిమా చేజారిపోయింది. ఆ సినిమా కోసం ఇతర ఏ ప్రాజెక్ట్‌కు సంతకం చేయలేదు. ఆ తర్వాత నేను మరో ప్రాజెక్ట్‌ చేశాను అది పట్టాలెక్కలేదు.

Also Read: ఏజెంట్ గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్: అనిల్

తేరేనామ్ తర్వాత నా సినిమాలు అనుకున్నంత విజయంను సాధించలేకపోయాయి. సినిమా అనేది ఒక జూదం లాంటింది. ఇక్కడ ఎప్పుడు ఏ సినిమా విజయం అందుకుంటుందని అని చెప్పడం కష్టమని అని భూమిక వెల్లడించింది.

- Advertisement -