పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరొయిన్ వరకు ఎదిగిన హిస్టరీ సన్నీ లియోన్ కు ఉంది. తన గతం గురించి నిస్సంకోచంగా మాట్లాడగల తత్వం ఆమెది. అప్పట్లో పోర్న్ మూవీస్ చేయడమే.. ఇప్పుడు తను ఈ స్థితికి రావడానికి కారణం అని గర్వంగా కూడా చెబుతుంది సన్నీ లియోన్. ఈ భామ మార్కెటింగ్ లో కూడా మహా దిట్ట. తన పేరుపైనే వెబ్ సైట్ యాప్స్.. మర్కండైజ్.. బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా లాంఛ్ చేసేసింది.
ఇప్పుడు ఓ బికినీ ఆల్బంను తయారు చేస్తోందట సన్నీ. అందులో తాను టీనేజ్ లో ఉన్నప్పుడు మొదలుకొని కొత్తగా చేస్తున్న సినిమాల దాకా బికినీ ఫోజులు అన్ని అందులో ఉంటాయట.అంతేకాదు సన్నీ తన ఫోటోలతో ఆల్బంతో పాటు ఆత్మ కథ కూడా రాసుకునే ఆలోచన ఉందట.
ఈ మధ్య సన్నీ లియోన్ సినిమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఆ మధ్య అర్బాజ్ ఖాన్ హీరోగా ఒక సినిమా చేస్తే అదికాస్తా బోల్తాకొట్టింది. తక్కువ బడ్జెట్ లో తీస్తారు కాబట్టి నిర్మాతలకు పెద్ద నష్టం ఉండదు కనక తనతో తీయడానికి ముందుకు వస్తూనే ఉంటారు అంటుంది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు ఈ బికినీ ఆల్బం – ఆత్మ కథ కనక బయటికి వస్తే ఎంత సెన్సేషన్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ ఆల్బం ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో చూడాలి.